July 17, 2026
Explore
అప్పులబాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

అప్పులబాధలు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

July 17, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అప్పుల వారి వేదింపులు తట్టుకోలేక వారికి వడ్డీలు చెల్లించలేక ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణ సమీపంలోని నక్కబండలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. డ్రైవర్‌గా పనిచేస్తున్న రెడ్డిప్రసాద్‌ (32) తన కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేక , వడ్డీ వ్యాపారుల వేదింపులు తీవ్రం కావడంతో రాత్రి ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Tags; Youth commits suicide, unable to bear the burden of debt.