అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గురువారం జగన్నాథుని రథయాత్ర భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద సాయంత్రం ప్రారంభమైన రథయాత్ర, రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద రాత్రి 10:05 గంటలకు ముగిసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదాయ పంచెకట్టులో హాజరై, పూరీ సంప్రదాయం ప్రకారం జగన్నాథుని రథాన్ని లాగి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
Tags: Grand Jagannath Rath Yatra in Amaravati; CM Chandrababu pulls the chariot.