July 17, 2026
Explore
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

July 17, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

ఆదిలాబాద్‌లో లంచం తీసుకుంటూ ఇద్దరు ఇరిగేషన్ శాఖ అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. సోనాల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మించేందుకు అవసరమైన ఎన్‌వోసీ (NOC) జారీ చేసేందుకు గాను బాధితుడి నుంచి రూ.60 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడి నుండి డబ్బులు తీసుకుంటుండగా ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Tags: Irrigation officials caught by ACB while accepting a bribe.