July 16, 2026
Explore
మోర్దానపల్లి లోని ఓ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి

మోర్దానపల్లి లోని ఓ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి

July 16, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మోర్దానపల్లి గ్రామంలోని ఓ ఫ్యాక్టరీలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది

విధులు నిర్వహిస్తున్న సమయంలో కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు

మృతుడు బంగారుపాళ్యం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన చైతన్య (32)గా గుర్తించారు.

పని చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు

ప్రమాదానికి గల కారణాలు, ఫ్యాక్టరీలో భద్రతా చర్యలు పాటించారా లేదా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: Worker dies of electric shock at a factory in Mordanapalli.