July 16, 2026
Explore
కూలీలకు ప్రతి రోజు రూ.700 లు చెల్లించాలి

కూలీలకు ప్రతి రోజు రూ.700 లు చెల్లించాలి

July 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

వర్షాలు లేక గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలు పనులు లేక అలమటిస్తున్నారని, అలాంటి వారికి పనులు కల్పించి, రోజుకు రూ.700లు చొప్పున కూలీ చెల్లించాలని వ్యవసాయకార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు తోపుకృష్ణప్ప డిమాండ్‌ చేశారు. గురువారం ఏఐటియుసి కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, సీపీఐ కార్యదర్శి రామమూర్తి, సహాయ కార్యదర్శి మున్నతో కలసి సమావేశం నిర్వహించారు. వర్షాలు లేని కారణంగా భూగర్భజలాలు అడుగంటిపోయిందని, బోర్లు ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయమే ఇబ్బందిగా మారిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని, పట్టణాల్లో , గ్రామీణ ప్రాంతాలలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. ఈ విషయాలపై ఈనెల 24న సమావేశం నిర్వహించి, తదుపరి కార్యచరణ ప్రణాళిక చేపడుతామని హెచ్చరించారు.

Tags: Laborers must be paid Rs. 700 per day.