July 16, 2026
Explore
కూటమి ప్రభుత్వం రజకులను ఎస్టీలుగా గుర్తించాలి

కూటమి ప్రభుత్వం రజకులను ఎస్టీలుగా గుర్తించాలి

July 16, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు రజకులను ఎస్టీలుగా గుర్తిస్తూ అసెంబ్లిలో తీర్మాణం చేసి, కేంద్రానికి నివేదికలు పంపాలని రజక సంఘ రాష్ట్ర కమిటి సభ్యుడు షణ్ముగం డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక దోబీకాలనీలో ఆయన రజకులతో సమావేశం నిర్వహించి , కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో ఈనెల 26న జరిగే రజకుల రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని , ఈ సమావేశానికి రజక కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరుకావాలెనని కోరారు. రజకులకు ఎస్టీ హ్గదా కల్పించేలా సమావేశంలో తీర్మాణం చేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. దీనిపై కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు శ్రీనివాసులు, శీనప్ప, రమణ, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Tags; The alliance government must recognize Rajakas as STs.