పుంగనూరుముచ్చట్లు:
రాష్ట్ర కాపు ఉధ్యమసంఘ నాయకుడు ముద్రగడ పద్మనాభం కు స్థానిక కాపు సంఘ నాయకులు బుధవారం స్థానిక బిఎంఎస్‌క్లబ్‌లో ఘన నివాళులర్పించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయల బలిజ సంఘ అధ్యక్షుడు గణేష్ , కార్యదర్శి పూలత్యాగరాజు ల ఆధ్వర్యంలో ముద్రగడ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి , పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ చూపిన ఉధ్యమబాటలో కాపులు ఐకమత్యంతో పయనించాలని పిలుపునిచ్చారు. ముద్రగడ ఆశయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు నానబాల మణి, యుగంధర్, రమేష్, రామచంద్ర, ఈ.రమేష్. రామకృష్ణ, మురళి, శ్రీనివాసులు, చెంగయ్య, అమర, జనార్ధన్, పరమేష్, ఉదయ్‌కుమార్, కార్పెంటర్ అమరతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Tags; Tributes to Kapu movement leader Mudragada