పుంగనూరుముచ్చట్లు:
ఈనెల 18న ప్రత్యేక లోక్‌అదాలత్ ద్వారా చెక్కు కేసులను మాత్రం పరిష్కరిస్తామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పరేష్‌కుమార్ తెలిపారు. బుధవారం కోర్టు ఆవరణంలో అడిషినల్ జూనియర్ సివిల్‌జడ్జి కృష్ణవంశి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో కలసి న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. చెక్కు కేసులను పరిష్కరించి, పెండింగ్ కేసులకు విముక్తి కలిగించేందుకు లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యాయవాదులు తమ పరిధిలోని చెక్కు కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏపిపి సురేష్‌కుమార్, న్యాయవాదులు వెంకట్రామయ్యశెట్టి, శివశంకర్‌నాయుడు, బాలాజికుమార్, ఎస్.భాస్కర్‌రెడ్డి, వినోద్‌కుమార్, రఘునాథరెడ్డి, హర్షవర్ధన్, ప్రభాకర్‌నాయుడు, టివి.రమణ, జహుర్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Cheque cases will be resolved at the Lok Adalat on the 18th.