July 15, 2026
Explore
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

July 15, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీ వద్ద ద్విచక్రవాహనాన్ని బలోరోజీపు ఢీకొనడంతో వాహనదారుడు నాగరాజు(60) అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని చెర్లోపల్లిలో నివాసం ఉన్న నాగరాజు సొంత పనులపై పుంగనూరుకు వచ్చి ఉదయం తిరిగి వెళ్తుండగా మార్గమధ్యలో భగత్‌సింగ్‌కాలనీ వద్ద బోలోరోజీపు ఢీకొని తీవ్ర రక్తగాయాలై అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ అన్సర్‌బాషా సంఘటన స్థలాన్ని సందర్శించి, వాహనాన్ని అదుపులోనికి తీసుకుని , కేసు నమోదు చేసి, భౌతికకాయాన్ని శవ పంచనామాకు ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

Tags: Man dies in road accident