July 15, 2026
Explore
గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు

గిరిజనుల సమస్యల పరిష్కారానికి చర్యలు

July 15, 2026 | Andhra Pradesh

ఎస్టీ కమిషన్‌ సభ్యులు వెంకటప్ప

పుంగనూరుముచ్చట్లు:

గ్రామీణప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్టీ కమిషన్‌ సభ్యులు వెంకటప్ప తెలిపారు. బుధవారం ఆయన మండలంలోని కుమ్మరగుంట, పుంగనూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఎరుకుల సంఘ నాయకులు మర్రిబాబు, విజయ్‌కుమార్‌, శ్రీనివాసులు ఆయనకు శాలువకప్పి, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుమ్మరగుంట గ్రామంలో ఎస్టీలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యను పరిశీలించారు. అధికారులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పట్టణ జెడ్పి గెస్ట్హౌస్‌లో గిరిజనులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ మంది అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో వారికి తాఖీదులు జారీ చేయాలని ఆదేశించారు. గిరిజనుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆధార్‌కార్డులు, ఇండ్లు, పెన్షన్లపై అర్జీలు ఇచ్చారు. అలాగే గిరిజనులకు చెందిన డికెటి భూముల ఆక్రమణలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, స్మశానవాటికలకు రహదారులు ఏర్పాటు చేయాలని సూచించారు. గిరిజన వాడలను అధికారులు సందర్శించి , సమస్యలను గుర్తించి నివేదికలు తయారు చేయాలన్నారు. మూడు నెలల తరువాత తిరిగి పర్యటిస్తామని ఆలోపు సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈయన వెంట జిల్లా గిరిజన సంక్షేమాధికారి తేజశ్వని, సీఐ సుబ్బరాయుడు, తహశీల్ధార్‌ రాము, ఎరుకుల సంఘ నాయకులు మేడా రామృకృష్ణ, మునికృష్ణ, బాలు, అక్కులప్పనాయక్‌, వీరాంజనేయులు, శ్రీనివాస్‌, వర్మ, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Measures to address tribal issues