పుంగనూరుముచ్చట్లు:
తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో జరిగిన ఘర్షణలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేసిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయాలని ఏపిడబ్యూజ్లిజెఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు . మంగళవారం జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి, తెలుగుదేశం నాయకుల చర్యలను ఖండించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సీఐ సుబ్బరాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, గిరి, గణపతి, సతీష్, కుమార్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
Tags: Those who attacked the journalists must be arrested.