July 14, 2026
Explore
15న ఎస్టీ కమిషన్‌ పర్యటనను జయప్రదం చేయండి

15న ఎస్టీ కమిషన్‌ పర్యటనను జయప్రదం చేయండి

July 14, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ చైర్మన్‌ వెంకటప్ప బుధవారం పుంగనూరు మండలంలో పర్యటిస్తారని, ఆయన పర్యటనను జయప్రదం చేయాలని ఎరుకుల సంఘం అధ్యక్షుడు మర్రిబాబు కోరారు. మంగళవారం స్థానిక జెడ్పి అతిధిగృహంలో ఎస్టీ నాయకులు రంగనాయకులు, రామకృష్ణ, శేఖర్‌, విజయ్‌కుమార్‌, సుబ్రమణ్యం తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ కమిషన్‌ చైర్మన్‌ ఉదయం 7 గంటలకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్హౌస్‌కు చేరుకుంటారని ,అక్కడి నుంచి 11 గంటలకు కుమ్మరగుంట గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. అలాగే మండల స్థాయి అధికారులతో జెడ్పి సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కులస్తులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి, పాతన్న, వన్నూరుస్వామి, ఈశ్వరప్ప, నాగరాజ, సి.సుబ్రమణ్యం,గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Make the ST Commission’s visit on the 15th a success.