పుంగనూరుముచ్చట్లు:
ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ఓటర్ల పరిశీలన కార్యక్రమంకు గడువు ఉందని నిర్లక్షం చేయవద్దని వైఎస్సార్‌సిపి ముస్లిం మైనార్టీల కార్యదర్శి అస్లాంమురాధి కోరారు. మంగళవారం ఆయన కుమ్మరవీధి ప్రాంతంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి నిర్వహించారు. ముఖ్యంగా ముస్లిం ఓటర్లకే ఇబ్బందులు ఎదురౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పొరపాట్లు ఉన్న డిజిటల్‌లో నమోదు కాకుండ పోతోందని తెలిపారు. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుని మిస్‌మ్యాచింగ్‌లు కాకుండ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నాయకుడు నయాజ్, బిఎవోలు, బిఎల్‌ఏలు పాల్గొన్నారు.
Tags; Do not be negligent just because there is a deadline for the SIR.