-నలుగురు అనుచరులపై సస్షెషన్
-12మందిపై హత్యాయత్నం కేసులు నమోదు
-ఎమ్మెల్యే కిషోర్‌కు బాధ్యతలు అప్పగింత
-ఇన్‌చార్జ్ని తొలగించేందుకు రంగం సిద్ధం
పుంగనూరుముచ్చట్లు:
నారావారిపార్టీలో క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించిన నలుగురి నాయకులను సస్పెండ్ చేస్తూ అధిష్టానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అగే ముష్ఠియుద్దాలకు కారణమైన 12మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. పుంగనూరు పరిస్థితిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేసి రెండు వర్గాల నాయకులను పిలుచుకుని విజయవాడకు రమ్మని పీలేరు ఎమ్మెల్యే కిషోర్‌కుమార్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మార్చాలని పట్టుబడుతు ప్రముఖవ్యాపారవేత్త మధుసూదన్‌నాయుడు, బోయకొండ మాజీ చైర్మన్ ఎస్‌కె.రమణారెడ్డి, కాపు సంఘ నాయకుడు సోమల సురేష్‌లు కూడ తమకే ఇన్‌చార్జ్ పదవి కావాలంటు ఎవరికి వారు వ్యక్తిగతంగా తమ అనుచరులతో డిమాండ్ చేయడం, వీరు ముగ్గురు కలసి ముక్తకంఠంతో సోమవారం తిరుపతిలో రాష్ట్ర మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, జనార్ధన్‌రెడ్డి సమక్షంలో పట్టుబట్టారు. ఈ విషయాలను జీర్ణించుకోలేని చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు మధుసూదన్‌నాయుడు వర్గానికి చెందిన దళిత నాయకుడు ముల్లంగి రమణపై హత్యాయత్నం చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై అసంమ్మతివర్గం నాయకులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్‌చార్జ్ని మార్చేదాక పోరాటం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి విషమించడం, నాయకులు మంత్రుల మాట వినే పరిస్థితి లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసి అక్కడి నుంచి మంత్రులు జారుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘర్షణలపై ఆరాతీశారు. దీనిపై చర్యలు తీసుకోమని ఆదేశించారు. దీనికి కారణమైన చల్లాబాబు వర్గానికి చెందిన ఉయ్యాలరమణ, నూకల నాగార్జున, మహమ్మద్‌అక్రమ్, చావడి షేక్‌కరీముల్లా లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ , రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
12 మందిపై కేసులు నమోదు…
తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి చెందిన దళితనాయకుడు ముల్లంగి రమణ పై హత్యయత్నం చేసిన కేసులో ఆయన ఫిర్యాదు మేరకు 12 మందిపై తిరుచానూరు పోలీసులు హత్యయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ టివి.సుధాకర్ ఎఫ్‌ఐఆర్ నెంబరు:222/2026 తో బిఎన్‌ఎస్ సెక్షన్లు 109(1)ఆర్‌డబ్యూజ్లి 3(5) సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఇందులో ఒకటో నిందితుడిగా ఉయ్యాలరమణ, రెండు నాగార్జుననాయుడు, మూడు బండ్లరమేష్, నాలుగు హేమప్రకాష్‌రెడ్డి, ఐదు గూడూరుహరి, ఆరు అమరనాథరెడ్డి, ఏడు అక్రమ్, ఎనిమిది నీలంభాస్కర్, తొమ్మిది గురుస్వామి, పది ఎంకె.చౌదరి, పదకొండు పాలూరికార్తీక్, పన్నెండు ప్రభాకర్ తదితరులపై కేసులు నమోదు చేశారు.
ఇన్‌చార్జ్ మార్పు ….
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండేళ్లలో వీధిన పడిందని , ఇన్‌చార్జ్ని మార్చి మధుసూదన్‌నాయుడుకు ఇవ్వాలంటు ఆయన వర్గం అధిష్ఠానానికి చేసిన ఫిర్యాదులు, తిరుపతిలో జరిగిన హత్యాయత్నం దాడులు చల్లావర్గాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటనలపై ఇన్‌చార్జ్ చల్లాబాబును మార్చేందుకు నారావారు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యానికి చెక్ పెడుతూ , వ్యాపారవేత్త మదుసూదన్‌నాయుడుకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్లు స్థానిక నేతలు వాపోతున్నారు.

Tags; Shock for Challa from Nara’s camp…