July 14, 2026
Explore
హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధులు విడుదల

హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధులు విడుదల

July 14, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు రూ.12.50 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ నుంచి జీవో విడుదలైంది. హైడ్రా కార్యకలాపాల కోసం ఈ నిధులు మంజూరు చేయబడ్డాయి. నిధులు డ్రా చేసుకోవాలని హైడ్రా కమిషనర్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై నేరుగా చర్యలు తీసుకునేలా హైడ్రాను ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, చట్టపరమైన విచారణ అధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన విభాగాన్ని కేటాయించనున్నారు.

Tags: Funds of ₹12.50 crore released to HYDRAA.