July 14, 2026
Explore
సింగరాయకొండలో ఘోరవిషాదం

సింగరాయకొండలో ఘోరవిషాదం

July 14, 2026 | Andhra Pradesh

ప్రకాశం ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఘోరవిషాదం చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నెంబర్ 2 వద్ద రైల్వే ట్రాక్ పైన వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు చిన్నారులతో కలిసి భార్యాభర్తలు మృతి చెందారు… అప్పటివరకు ప్లాట్ఫారంపై మాట్లాడుకుంటూ ఉన్న ఈ భార్యాభర్తలు ఒక్కసారిగా ట్రాక్పై వస్తున్న గూడ్స్ రైలు గమనించి పట్టాలపై దూకడంతో ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది.. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ఉండటంతో ఆ ప్రాంతమంతా విషాదం చోటుచేసుకుంది.. మీరు ఎక్కడ వారు ఏ ప్రాంతానికి చెందినవారు తెలియదు.. హుటాహుటిన రైల్వే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాలను తరలించారు.. వీరికి సంబంధించిన వివరాలను దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Horrific tragedy in Singarayakonda