July 13, 2026
Explore
15న షెడ్యూల్‌ తెగల కమిషన్‌ రాక

15న షెడ్యూల్‌ తెగల కమిషన్‌ రాక

July 13, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

రాష్ట్ర షెడ్యూల్‌ తెగల కమిషన్‌ బృందం విజయవాడ నుంచి ఈనెల 15న అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తారని గిరిజన సంక్షేమాధికారి తేజశ్వని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు స్థానిక ఫారెస్ట్ గెస్ట్హౌస్‌కు చేరుకుంటారని ,అక్కడి నుంచి 11 గంటలకు కుమ్మరగుంట గ్రామంలో పర్యటించి , మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. 3 గంటలకు స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో జిల్లా , డివిజన్‌ స్థాయి అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఎస్టీ కులస్తులు , అన్నిశాఖల అధికారులు తప్పక హాజరుకావాలెనని కోరారు.

Tags; Scheduled Tribes Commission to visit on the 15th