July 13, 2026
Explore
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు హారం విరాళం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు హారం విరాళం

July 13, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

విజయనగరానికి చెందిన భక్తుడు శ్రీనివాస సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి సుమారు 56.8 గ్రాముల బరువున్న వజ్రాలతో కూడిన బంగారు హారాన్ని ఆలయ అధికారులకు విరాళంగా సమర్పించారు.

ఈ హారం విలువ సుమారు రూ.12.50 లక్షలు.

ఆలయ అధికారులు దాతకు వేదాశీర్వచనం అందించి, శ్రీ పద్మావతీ అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ లు సురేష్, రమేష్, మునిచెంగల్ రాయులు, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చలపతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: Diamond-studded gold necklace donated to Goddess Sri Padmavati at Tiruchanur.