July 13, 2026
Explore
మంచినీటిబోరు మరమ్మతులకు రెండునెలలా..?

మంచినీటిబోరు మరమ్మతులకు రెండునెలలా..?

July 13, 2026 | Andhra Pradesh

మున్సిపల్‌ అధికారుల విచిత్ర పాలన

పుంగనూరుముచ్చట్లు:

మున్సిపాలిటిలో అధిక ప్రాధాన్యత మంచినీరు , పారిశుద్ధ్య కార్యక్రమాలకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇక్కడ ఇవి రెండు మినహా మిగిలినవి చురుగ్గా చేస్తారు. పట్టణంలోని శాంతినగర్‌లో మంచినీటి బోరు మరమ్మతులకు గురై రెండు నెలలు కావస్తోంది. ఈ విషయమై సాక్షిలో జూన్‌ 27న ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు వెంటనే షో చేశారు. మరమ్మతులు చేసేందుకు బోరు మోటారు తీసి , పైపులను రోడ్డుపై పడేశారు. అక్కడితో అధికారులు ఆ సమస్యను గాలికి వదిలేశారు. మరమ్మతులు చేస్తామని చెప్పి 15 రోజులు అవుతున్న మంచినీటి బోరు మాత్రం మరమ్మతులకు నోచుకోలేదు. ఈ విషయమై శాంతినగర్‌ వాసులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మంచినీటికి ప్రాధాన్యత ఇవ్వని అధికారులు ఇక పాలన ఏం సాగిస్తారంటు మండిపడుతున్నారు.

Tags: Two months for drinking water borewell repairs?