July 13, 2026
Explore
పుంగనూరు తెలుగుదేశంలో తమ్ముళ్ళ ముష్టియుద్దాలు

పుంగనూరు తెలుగుదేశంలో తమ్ముళ్ళ ముష్టియుద్దాలు

July 13, 2026 | Andhra Pradesh

  • దేశం నాయకుడికి తీవ్ర రక్త గాయాలు
  • మంత్రి, ఇన్‌చార్జ్కి వ్యతిరేకంగా నినాదాలు
  • గ్రూపులతో బట్టబయలైన విబేదాలు

తిరుపతి ముచ్చట్లు:

పుంగనూరు తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల గ్రూపు తగాదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దాడులలో తెలుగుదేశం నాయకుడు రమణ తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం తిరుపతి హ్గటల్‌లో జరిగింది. పుంగనూరు ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, మరో గ్రూపు వర్గం నాయకుడు మధుసూదన్‌నాయుడు మధ్య అంతర్గతపోరు చాపక్రింద నీరులా సాగుతోంది. ఇలా ఉండగా ఈవిషయమై రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మధుసూదన్‌నాయుడు వర్గం తో పాటు బోయకొండ మాజీ చైర్మన్‌ ఎస్‌కె.రమణారెడ్డి, కాపు సంఘ జిల్లా నాయకుడు సోమల సురేష్‌ లు జతకట్టారని తెలిసింది. ఇన్‌చార్జ్ని మార్చాల్సిందేనని పట్టుబట్టడంతో ఇన్‌చార్జ్ వర్గంతో మాటల యుద్ధం సాగింది. చివరగా ఇన్‌చార్జ్ వర్గం ప్రత్యర్థి వర్గానికి చెందిన రమణ పై దాడి చేయడంతో అతనికి తల నుంచి రక్తశ్రావం జరిగింది. దీనిపై అందరు నాయకులు కలసి ఇన్‌చార్జ్కి , మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్‌చార్జ్ని మార్చాల్సిందేనని పట్టుబట్టారు. ప్రస్తుతం ఇరు వర్గాలు ఎవరికి వారు బలనిరుపణ చేసుకునేందుకు సిద్ధమౌతున్నారు. పోలీసులు ఉన్న ఏమి చేయలేని స్థితిలో ఉండిపోవాల్సి వచ్చింది.

Tags: Fistfights among Telugu Desam cadres in Punganur.