లక్కిరెడ్డిపల్లె ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లె మండలం నలందానగర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉండగా, వారిని ఇళ్ల వద్ద దింపేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
బస్సును రివర్స్ తీస్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో స్తంభాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో విద్యుత్ స్తంభం విరిగి పడే స్థితికి చేరుకోగా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ ఏఈ హరినాథ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని స్తంభం పునరుద్ధరణ పనులు చేపట్టారు. పాఠశాల బస్సుల భద్రతపై అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Tags: School bus crashes into electric pole; disaster narrowly averted.