సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని యర్రగుంట్ల చెరువులో నీటి కొరత కారణంగా దాహంతో అలమటిస్తున్న వందలాది నెమళ్లకు గ్రామస్థులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.
అడవి జీవాల సంరక్షణలో భాగంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చిన గ్రామస్థులు చెరువులో నీటిని నింపి నెమళ్ల దాహాన్ని తీర్చారు. వారి సేవాభావాన్ని స్థానికులు అభినందించారు. వర్షాలు కురిసే వరకు వన్యప్రాణులకు అవసరమైన నీటిని అందించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని గ్రామస్థులు తెలిపారు.
Tags: Villagers quenched the peacocks’ thirst.