July 11, 2026
Explore
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

July 11, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి పట్టణంలోని మాసాపేట సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ వెస్ట్ సెక్షన్ ఏఈ నాగేశ్వరరావు తెలిపారు. 11 కేవీ ఫీడర్ల మరమ్మత్తు పనుల కారణంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. రాజీవ్ స్వగృహ, మాసాపేట, పాత రాయచోటి, బోయపల్లి 11 కేవీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ సమయంలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని శాఖకు సహకరించాలని ఆయన కోరారు.

Tags: Power supply interruption today