ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా లభించనుంది. కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం.. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత వీరికి ఐఏఎస్ ప్రమోషన్స్‌పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Tags: IAS status for five Group-1 officers