పుంగనూరుముచ్చట్లు:
స్వచ్చపుంగనూరు మున్సిపాలిటికి మురుగునీరు స్వాగతం పలుకుతోంది. మదనపల్లె నుంచి పట్టణంలోనికి వచ్చే ఎంబిటి రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం వద్ద మురుగునీరు, ప్లాస్టిక్ కవర్లు దుర్గంధభరితమై ప్రజలకు స్వాగతం పలుకుతోంది. అలాగే తిరుపతి నుంచి పట్టణంలోనికి వచ్చే కొత్తపేట క్రాస్, బెంగళూరు రోడ్డు నుంచి తాటిమాకులపాళెం వద్దకు వచ్చే కౌండిన్య నది కాలువలో మురుగునీటి నిల్వలు, ప్లాస్టిక్ కవర్లు దుర్గంధభరితమైన వాసనను వెదజల్లుతోంది. అలాగే కాలువలను శుభ్రం చేయకపోవడంతో పిచ్చిగడ్డి మొలచి నీటి నిల్వలు పెరిగింది. దీని ద్వారా దోమలు ప్రభలి ప్రజలు ఆనారోగ్యం భారిన పడుతున్నారు. అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలతో సరిపెట్టడంతో పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు అధ్వాన్నంగా తయారౌతున్నాయి.


Tags; Welcome to unclean Punganur.