అమరావతిముచ్చట్లు:
కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయనాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు.
మూత్రపిండాలు దెబ్బతినడం, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది మృతి చెందారు.
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’ పేరుతో విక్రయింపులు జరుగుతున్నాయి.
ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది మరణించడం తో..,
ఈ పొడిలో ఏముందో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేశారు.
ఈ పొడిలో ‘ఆరమైన-ఓ’ అనే రసాయనాన్ని వాడుతున్నారని, దీన్ని పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Tags; Hazardous chemical traces found in kallapi powder!