July 10, 2026
Explore
బి.కొత్తకోట పాఠశాలలో వివాదం.. వాస్తవాలు తేల్చాలని తల్లిదండ్రుల డిమాండ్

బి.కొత్తకోట పాఠశాలలో వివాదం.. వాస్తవాలు తేల్చాలని తల్లిదండ్రుల డిమాండ్

July 10, 2026 | Andhra Pradesh

బి.కొత్తకోట ముచ్చట్లు:

బి.కొత్తకోట తూర్పు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశంగా మారింది. పాఠశాలలో ఉపాధ్యాయులు శివారెడ్డి, నీలేశ్ తరగతులు నిర్వహించకుండా సెల్‌ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి ఆరోపిస్తూ కలెక్టర్, డీఈఓ, ఎంఈఓలకు ఫిర్యాదు చేశారు. తాను ప్రశ్నించగా యూనియన్ నాయకులమంటూ బెదిరించారని కూడా ఆమె పేర్కొన్నారు.

మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు వాస్తవాలు ఏమిటో తేల్చేందుకు విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పిల్లలను మంచి విద్య కోసం పాఠశాలకు పంపుతున్నామని, తరగతి గదిలో బోధనకు బదులుగా ఫోన్లలో సమయం గడిపారనే ఆరోపణలు నిజమైతే అది తీవ్రంగా పరిగణించాలని, అదే సమయంలో ఆరోపణలు నిరాధారమైతే కూడా వాస్తవాలను బహిర్గతం చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించి, పాఠశాలలో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags: Controversy at B. Kothakota school; parents demand that the facts be established.