తాడేపల్లి ముచ్చట్లు:
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
Tags: Minister Mandipalli Praja Darbar in Tadepalli