చిన్నమండెం ముచ్చట్లు:
రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా చిన్నమండెం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ (బాలికలు)ను సందర్శించి వసతి గృహాలు, స్టోర్‌రూమ్‌లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం గోదాం, ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసి బియ్యం బస్తాలను తూకం వేయగా 50 కిలోలకు బదులుగా 40 నుంచి 42 కిలోలే ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో బస్తాలో 8 నుంచి 10 కిలోల వరకు బియ్యం తక్కువగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా పౌర సరఫరాల సంస్థ డీఎంను వివరణ కోరుతూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సంక్షేమ పథకాల అమలు, ఆహార భద్రత, విద్యా, పోషకాహార సేవలపై సమీక్ష నిర్వహించారు.
Tags: Huge discrepancy in rice weight at Chinnamandem MLS point.