July 8, 2026
Explore
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: మద్దిరాల సుదర్శన్ రెడ్డి

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: మద్దిరాల సుదర్శన్ రెడ్డి

July 8, 2026 | Andhra Pradesh

లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:

లక్కిరెడ్డిపల్లి మండలంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మద్దిరాల సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. రైతు, పేద, విద్యార్థి, మహిళల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి గ్రామ అభివృద్ధి, ప్రతి కుటుంబ సంక్షేమమే వైఎస్సార్ లక్ష్యమని పేర్కొంటూ, ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి ప్రజాసేవలో ముందుకు సాగుతామని తెలిపారు.

Tags: YSR’s services are unforgettable: Maddirala Sudarshan Reddy