July 8, 2026
Explore
చక్రాలమడుగు భూ కబ్జాలపై విచారణ జరపాలి: పాపినేని

చక్రాలమడుగు భూ కబ్జాలపై విచారణ జరపాలి: పాపినేని

July 8, 2026 | Andhra Pradesh

రాజంపేటముచ్చట్లు:

రాజంపేటలోని చక్రాలమడుగు భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజంపేట సబ్‌కలెక్టర్ భావనకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సర్వే నంబర్లలో మార్పులు చేసి రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో పాటు కొందరు అధికారులు అక్రమాలకు సహకరించారని ఆరోపిస్తూ, టీడీపీ ఇన్‌చార్జి చామర్తి జగన్మోహన్ రాజు దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

చక్రాలమడుగు పూర్తిగా ఆక్రమణలకు గురైందని, ఈ భూముల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు.

Tags: An inquiry must be conducted into the Chakralamadugu land encroachments: Papineni.