పుంగనూరుముచ్చట్లు:
విద్యార్థులు ప్రతి ఒక్కరు తెలుగుబాషను రాయడం, మాట్లాడటం అలవర్చుకోవాలని తెలుగుబాషను మరచిపోతే మనుగడ కష్టమని విశ్రాంత తెలుగుపండితుడు వెంకటపతి అన్నారు. బుధవారం స్థానిక బసవరాజ హైస్కూల్‌లో తెలుగుబాషా విజ్ఞానసమితి ప్రతినిదులు రెడ్డెప్పరెడ్డి, వెంకటపతి కలసి ఎంఈవో నటరాజారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగుబాష పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటపతి మాట్లాడుతూ తెలుగుబాషను ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. అన్నిబాషల్లోను తెలుగుబాష మూడవ స్థానంలో ఉందని తెలిపారు. తెలుగుబాషను కాపాడుకోవడం తెలుగువారిగా మన కర్తవ్యం…మనబాధ్యత అని తెలిపారు. ఈకార్యక్రమంలో తెలుగుబాషాభిమానులు భక్తవత్సలరాజు, ఉమామహేశ్వరి, ఎర్రప్ప యాదవ్ , మునస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Tags: Do not forget the Telugu language.