పుంగనూరుముచ్చట్లు:
పేదల పెన్నిది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సిపి రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో అభిమానులు, పార్టీ నాయకులు రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. రాజశేఖర్‌రెడ్డి అమర్‌రహే….అంటు నినాదాలు చేశారు. అలాగే యువజన సంఘ నాయకుడు ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. మండలంలోని సుగాలిమిట్టలో గిరిజన నాయకులు వేణు, మనోజ్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, పలమనేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెంకటరెడ్డి యాదవ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయరామిరెడ్డి, పార్టీ నాయకులు ఖాదర్, ఇంతియాజ్, మహబూబ్‌బాషా, రమణ, శ్రీనివాసులు, మమ్ము, సిద్దు, లక్ష్మణరాజు, సురేంద్రరెడ్డి, బావాజాన్, నజీర్, మనోహర్, దేవమ్మ, రామయ్య, రవికుమార్, మునిరెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Tags: Birth anniversary celebrations of the late Chief Minister Rajanna.