July 8, 2026
Explore
రాజన్నకు నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాజన్నకు నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

July 8, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నేడు కూడా ప్రతి ఇంట్లో తలుచుకునేలా ఆ నాటి పాలన

దేశం లో ఎక్కడా లేని విధంగా అనేక పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కే దక్కుతుంది

మావిగన్ పై వైసీపీ సీనియర్లలో అసంతృప్తి అవాస్తవం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైసీపీ నాయకులు, ప్రజలు కూడా మావిగన్ కు మద్దతు గా ఉన్నారు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అన్యాయం జరిగితే ఎవరికైనా మద్దతుగా ఉంటాం: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మనిషిని చంపేసి బూడిద కూడా ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్…..

దేశం లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి

ఆరోగ్య శ్రీ లాంటి పథకం ముందు ఎక్కడా లేదు. దేశం మొత్తం ఇది ఆదర్శంగా తీసుకుంది

జలయజ్ఞం ద్వారా నిర్మించిన అనేక ప్రాజెక్టులు నేడు ఏపీ, తెలంగాణ లో జీవ నాడులుగా ఉన్నాయి

ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకుని అనేక మంది విద్యార్థులు నేటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకునే పరిస్థితి ఉంది

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించి ఇన్ని ఏళ్ళు అయినా, ఆయన్ని ఇంకా గుండెల్లో పెట్టుకో ఉన్నారు

మావిగన్ కు ప్రజల మద్దతు ఉంది

వైసీపీ లో సీనియర్లు అసంతృప్తి తో ఉన్నారు అన్నది అవాస్తవం

సీనియర్లు, ప్రజలు అందరూ కూడా మావిగన్ కు మద్దతుగా నిలుస్తున్నారు

మావిగన్ ద్వారా కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అనేక వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి

క్రిమినల్స్ కు వైసీపీ మద్దతు అనడం సరికాదు. రావణ్ పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తే మాకేం సంబంధం

రావణ్ కు వైసీపీ కి సంబంధం లేదు. అన్యాయం జరిగితే ఎవరికైనా మద్దతు ఇస్తాం

పోలీస్ స్టేషన్ లో గాదె సాయికృష్ణ మృతి చెందితే క్రిమినల్ కు మద్దతు అంటారు

కనీసం బూడిద అయినా ఇవ్వండి అని తల్లి అడుక్కునే పరిస్థితి కి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు

Tags:Peddireddy Ramachandra Reddy pays tribute to Rajanna.