రామాపురం ముచ్చట్లు:
రామాపురంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, హిందూపురం నియోజకవర్గ పరిశీలకులు రమేష్‌కుమార్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags: Grand tributes on the occasion of YSR’s birth anniversary.