న్యూఢిల్లీముచ్చట్లు:
న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర రైతాంగ అభివృద్ధికి అదనపు కేంద్ర నిధులు, ప్రత్యేక పథకాలు మంజూరు చేయాలని కోరారు. రాయచోటి నియోజకవర్గంలో వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పరిశోధన, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర–కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతులకు మరింత మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.
Tags; Minister requests an agriculture college for Rayachoti.