July 8, 2026
Explore
కస్తూరిబా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

కస్తూరిబా పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

July 8, 2026 | Andhra Pradesh

కురబలకోటముచ్చట్లు:

కురబలకోట కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజమల దేవి బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, వంటశాల, నిల్వ గది, పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలపై వివరాలు తెలుసుకుని, నాణ్యమైన భోజనం అందించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు.

Tags: Surprise inspection at Kasturba School