అన్నమయ్య ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లె సర్కిల్ పరిధిలోని చిత్తూరు–కడప జాతీయ రహదారిపై మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 2 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కమలాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రామాపురం మండలం బండపల్లె పంచాయతీ గ్రీన్‌పార్క్ సమీపంలో కారులో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు.
నిందితుడు గాలివీడు మండలానికి చెందిన కమలాకర్‌రెడ్డి బీటెక్ పూర్తి చేసిన అనంతరం మత్తు పదార్థాలకు బానిసై, స్నేహితులతో కలిసి విశాఖపట్నం నుంచి గంజాయి తీసుకొచ్చి రాయచోటి, బెంగళూరు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులపై గతంలో అసభ్య పోస్టులు పెట్టిన కేసు కూడా అతనిపై నమోదైందని చెప్పారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై నిత్యం పర్యవేక్షణ ఉంచి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చూడాలని డీఎస్పీ సూచించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు నగదు రివార్డులు అందజేశారు.
Tags: 2 kg of Ganja Seized; Youth Arrested