రామాపురం ముచ్చట్లు:
రామాపురం మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సంక్షేమానికి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags: YSR’s birth anniversary celebrations held on a grand scale