గాలివీడు ముచ్చట్లు:
గాలివీడులో రైస్‌మిల్ యజమాని జీవి శ్రీనివాసులు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డైంది.
బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదం నేపథ్యంలో నాకు తెలిసిన వారి ప్రమేయం ఉందని ఆరోపించారు. తనకు, కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
Tags: Rice mill owner’s car vandalized in Galiveedu!