July 8, 2026
Explore
ప్రొద్దుటూరు లో యూట్యూబ్ చానల్స్ దందాలకు పోలీసుల చెక్…!

ప్రొద్దుటూరు లో యూట్యూబ్ చానల్స్ దందాలకు పోలీసుల చెక్…!

July 8, 2026 | Andhra Pradesh

బెదిరింపుల కేసులో యూట్యూబర్ అరెస్ట్..!

ప్రొద్దుటూరు ముచ్చట్లు:

ప్రొద్దుటూరులోని పలు మెడికల్ షాపుల యాజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో యూట్యూబర్ ఉదయగిరి శివరాంను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామానికి చెందిన గంజికుంట నాగరాజును గత నెల 4న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో రెండవ నిందితుడైన ఉదయగిరి శివరాంను బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుప రిచారు. కోర్టు ఆదేశాలతో అతన్ని రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ మైనుద్దిన్ తెలిపారు.

Tags:Police crack down on YouTube channel rackets in Proddatur…!