July 8, 2026
Explore
డ్వాక్రా మహిళకు నకిలీ బ్యాంకు ఉద్యోగి టోకరా

డ్వాక్రా మహిళకు నకిలీ బ్యాంకు ఉద్యోగి టోకరా

July 8, 2026 | Andhra Pradesh

గుడివాడ ముచ్చట్లు:

డ్వాక్రా గ్రూపు సభ్యుల నగదు చెల్లించడానికి వచ్చిన ఓ మహిళకు గుడివాడ ఎస్బీఐ బజారు బ్రాంచి వద్ద ఓ వ్యక్తి టోకరా వేశాడు. ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

వారి కథనం ప్రకారం మండలంలోని రామచంద్రాపురానికి చెందిన బొక్కా లక్ష్మీనర్సమ్మ వారి డ్వాక్రా గ్రూపు నగదు బ్యాంకులో జమ చేయడానికి ఎస్బీఐ బజారు బ్రాంచికి ఈనెల 6వ తేదీన వెళ్లారు. ఈక్రమంలో రూ.56 వేల నగదు గ్రూపు ఖాతాలో జమ చేయడానికి ఓచరు రాసుకుని ఉండగా ఓ వ్యక్తి తాను బ్యాంకు ఉద్యోగినని చెప్పి ఆమె వద్ద నగదు ఓచరు తీసుకుని వెళ్లాడు. అనంతరం ఆ వ్యక్తి బ్యాంకులో నుంచి వచ్చి కౌంటరు రసీదు ఇచ్చి వెళ్లిపోయాడు. లక్ష్మీ నర్సమ్మ ఇంటికి వెళ్లి గ్రూపు సభ్యు లకు ఆ రసీదు ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. నగదు జమపై డ్వాక్రా గ్రూపుల ఆర్పీ ప్రశ్నించడంతో ఆమెకు రసీదు చూపారు. బ్యాంకులో నగదు కట్టలేదని చెప్పడంతో డ్వాక్రా సంఘ సభ్యులు మేనేజరును సంప్రదించారు. నగదు తీసుకున్న వ్యక్తి తమ ఉద్యోగి కాదనడంతో జరిగిన మోసంపై ఫిర్యాదు చేయగా ఎస్.ఐ వై.వి.వి.సత్యనారా యణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Fake bank employee dupes DWCRA woman