March 23, 2026
Explore
రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టం

రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టం

March 23, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీలో అకాల వర్షాలు, వడగళ్లతో 11,337 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. 15 జిల్లాల్లోని 9,950 హెక్టార్లలో వరి, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలు, 9 జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, పశ్చిమాసియా యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోవడంతో రాయలసీమలో కమలాపండు ధర టన్నుకు రూ. 10 వేలు తగ్గి, ప్రస్తుతం రూ. 22 వేలకు పడిపోయింది. దీంతో అటు ప్రకృతి వైపరీత్యం, ఇటు మార్కెట్ ఒడిదుడుకులతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Tags: Crop Damage Due to Unseasonal Rains in the State