విజయవాడ ముచ్చట్లు:
విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వించిపేటలో తెల్లవారుజాము నుంచి ఎన్‌ఐఏ (NIA) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
వించిపేట గాంధీ బొమ్మ సెంటర్‌లోని ఓ నివాస గృహంలో ఎన్‌ఐఏ బృందం తనిఖీలు చేపట్టింది.
స్థానిక పోలీసుల సహకారంతో సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.
ఎన్‌ఐఏ అధికారులు పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో వించిపేట ప్రాంతంలో స్థానికంగా ఆసక్తి నెలకొంది.
Tags: NIA raids within the limits of Vijayawada Two Town Police Station.