July 8, 2026
Explore
అన్నమయ్య జిల్లాకు రూ.1.94 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులు

అన్నమయ్య జిల్లాకు రూ.1.94 కోట్ల ఎన్‌హెచ్‌ఎం నిధులు

July 8, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాకు నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కింద రూ.1.94 కోట్ల నిధులు విడుదలైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనరసయ్య తెలిపారు. ఈ నిధులను జిల్లాలోని 63 ప్రభుత్వ వైద్య సంస్థలకు కేటాయించినట్లు చెప్పారు.

ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, వైద్య సేవల మెరుగుదలతో పాటు ఇతర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, మెరుగైన వసతులు అందించడంలో ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే జాతీయ ఆరోగ్య మిషన్ ప్రధాన లక్ష్యమని డీఎంహెచ్‌వో వివరించారు.

Tags: Rs 1.94 crore in NHM funds for Annamayya district