అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలోని 2 లక్షలకుపైగా హస్తకళాకారులంతా నా కుటుంబ సభ్యులేనన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ప్రపంచ మార్కెట్‌తో హస్తకళలను అనుసంధానం చేయాలని అధికారులకు సూచన.
ప్రతి కళాకృతి వెనుక ఉన్న కథ, కళాకారుడి శ్రమ ప్రపంచానికి తెలియాలని..,ఈ-కామర్స్, సాంకేతికతతో హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని ఆకాంక్ష.
హస్తకళాకారుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీ.
కళాకారులకు ఆర్థిక భరోసా, మార్కెట్ విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ తెలియచేసారు.
హస్తకళా గ్రామాలను పర్యాటక రంగంతో అనుసంధానం చేసి ఉపాధి అవకాశాలు పెంచాలని..,హస్తకళలు భారత సంస్కృతి, వారసత్వానికి ప్రతీకలని… వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్య.
శ్రీమతి అన్నా కొణిదల కోసం ఉప్పాడ చీరలు కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.
Tags: ‘Local to Global’… Pawan Kalyan’s new mantra!