July 7, 2026
Explore
త్వరలో ఎస్టీ కమిషన్‌ జిల్లాకు రాక

త్వరలో ఎస్టీ కమిషన్‌ జిల్లాకు రాక

July 7, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బొజ్జరెడ్డి త్వరలో జిల్లా పర్యటనకు వస్తున్నారని ఆదివాసి ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ శంకర్రావు తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలోని కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి లేకపోవడం, విద్యా, వైద్య పరమైన అంశాలను కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటే జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో ఎస్టీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించాలని విన్నవించారు. దీనిపై చైర్మన్‌ బొజ్జరెడ్డి జిల్లా పర్యటనకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలోఅసోసియేట్‌ ప్రెసిడెంట్‌ సాకే ముసలయ్య, రాష్ట్ర కార్యదర్శి కట్టా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ లు ఉన్నారు.

Tags: ST Commission to arrive in the district soon