July 7, 2026
Explore
రూ.21.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

రూ.21.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

July 7, 2026 | Andhra Pradesh

రాజంపేట ముచ్చట్లు:

రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు అందజేశారు. మొత్తం రూ.21,40,211 విలువైన చెక్కులను సుమారు 28 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో సీఎంఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అవసరమైన ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి కి, నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్ మోహన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:Distribution of CMRF cheques worth Rs 21.40 lakh