అమరావతిముచ్చట్లు:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17న మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది.
రంపచోడవరంలో జరిగే రాష్ట్రస్థాయి మెగా పేరెంట్– టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేసి, వారి విద్యా ప్రగతి, నైపుణ్యాలు, హాజరు, ఇతర అంశాలపై సమగ్ర వివరాలు తెలియజేయనున్నారు.
పాఠశాల–తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, విద్యార్థుల అభ్యాస నాణ్యతను మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని విద్యాశాఖ తెలిపింది.
Tags; Statewide Mega Parent-Teacher Meeting on the 17th of this month.