లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవటపల్లి రవీంద్రనగర్ అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. నూతన భవనంతో పాటు చిన్నారుల హాజరు, పోషకాహార పంపిణీ, మెనూ అమలు, అనీమియా, తక్కువ బరువు ఉన్న చిన్నారుల వివరాలను పరిశీలించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వంటగది, ఆహార నిల్వలను తనిఖీ చేసి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని, పరిశుభ్రత పాటిస్తూ చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు.
Tags; Collector inspected the Anganwadi center.